ఓపెన్ బుక్ మనం.. ఎవడికీ భయపడే పనేలేదు
on Oct 15, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం. మనసులో ఏదీ దాచుకోరు. మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేస్తారు. తన వ్యక్తిగత విషయాలపై స్పందించడానికి కూడా ఆయన మొహమాట పడరు. తాజాగా తన విగ్గు గురించి మాట్లాడిన బాలకృష్ణ.. తాను తెరిచిన పుస్తకం లాంటి వాడిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.
"అప్పట్లో ఇప్పటిలాగా క్యారవాన్ లు ఉండేవి కాదు కదా. విగ్గు తీసి హ్యాపీగా చెట్టు కింద చాప, దిండు వేసుకొని విశ్రాంతి తీసుకునేవాడిని. మొన్న ఎవడో అన్నాడు.. ఈయన విగ్గు పెట్టుకుంటాడా అని. నీకేంటి? నువ్వేం పీక్కొని గడ్డం పెట్టుకుంటావు అన్నాను. ఓపెన్ బుక్ మనం అంతా. ఎవడికీ భయపడే పనేలేదు." అని బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం బాలయ్య మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read