బిగ్‌బాస్ బ్యూటీపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి!
on Sep 30, 2023
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ రియాలిటీ షోకి ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌కి ఫ్యాన్ పాలోయింగ్ ఎక్కువ. వారి పర్సనల్ విషయాలంటే ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. మరి అలాంటిది బిగ్‌బాస్‌లో కంటెస్ట్ చేసిన ఒక బ్యూటీపై దాడి జరిగితే ఫ్యాన్స్ స్పందన ఎలా ఉంటుంది.
బిగ్‌బాస్ ఫేమ్ అర్చన గౌతమ్‌కు న్యూ ఢల్లీిలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. పార్టీ హై కమాండ్‌ను కలసి దరఖాస్తు చేసుకునేందుకు తండ్రితో కలిసి వచ్చిన అర్చనపై దాడి జరిగిందని తెలుస్తోంది. పార్టీ కార్యాలయంలోకి అనుమంతించకుండా అర్చనను, ఆమె తండ్రిని కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా వారిని ఆ పరిసరాల్లో ఉండకుండా తరిమేశారని తెలుస్తోంది. ఇప్పుడీ వీయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఆ విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతోపాటు ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపేందుకు పార్టీ కార్యాలయానికి వెళ్ళింది అర్చన. ఆ సమయంలో వారిద్దరిపై దాడి జరిగింది. దాడి చేసిన వారిలో మహిళా కార్యకర్తలు కూడా వుండడం గమనార్హం. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.