హమ్మయ్య విక్రమ్ మూవీ వచ్చేస్తోంది!
on Sep 26, 2023
చియాన్ విక్రమ్ నటించిన సినిమా ధ్రువ నక్షత్రం. గౌతమ్ వాసుదేవమీనన్ డైరెక్ట్ చేశారు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు. దాదాపు పదేళ్ల తర్వాత అనేక అడ్డంకులను దాటి ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఎప్పటి నుంచో ఇదిగో అదిగో అంటూ రిలీజ్ డేట్‌పై వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు చిత్రర యూనిట్ ధ్రువ నక్షత్రం రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. అదే నవంబర్ 24. అంటే దీపావళి సందర్భంగా అనుకోవాలి. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమా రిలీజ్ అవుతుందనటంలో సందేహం లేదు. మేకర్స్ రిలీజ్ డేట్‌ను చెప్పటంతో అభిమానులు హమ్మయ్య అని అనుకుంటున్నారు.
ఆ మధ్య ఈ టీమ్ ` ఒరు మనం..` అంటూ ఓ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా రీసెంట్‌గా `హిస్ నేమ్ ఈజ్ జాన్` అంటూ మరో పాటను విడుదల చేసింది. రెండు పాటలకు చాలా మంచి స్పందన వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ పాత్రను పూర్తిగా డిలీట్ చేశారు. అందుకు కారణాలేంటనే విషయాన్ని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాత్రమే చెప్పాల్సి ఉంది. మరి ప్రమోషన్స్‌లో ఆయనెలాంటి సమాధానం చెబుతారోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. విక్రమ్ పక్కన రీతువర్మ నటించారు. పార్తిబన్, సిమ్రన్, దివ్యదర్శిని, వినాయకన్ కీలక పాత్రల్లో నటించారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు.
పదేళ్ల ముందు అంటే...2013లో ఈ సినిమాను ప్రకటించారు డైరక్టర్. పలువురు నటీనటులు మారిన తర్వాత ఈ షేప్‌కి వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో జాన్ అనే రోల్ చేశారు మన చియాన్ విక్రమ్. హైలీ ట్రెయిన్డ్ ఇండియన్ స్పై క్యారెక్టర్‌లో కనిపిస్తారాయన. తనతో పాటు పది మంది సీక్రెట్ ఏజెంట్స్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ ఇండియాకు పనిచేస్తారు. వాళ్లను లీడ్ చేసే వ్యక్తిగా మన హీరో విక్రమ్ కనిపించబోతున్నారు.
Also Read