కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా చరణ్ హీరోయిన్.. ఎవరి కోసమో తెలుసా?
on Apr 26, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా పరిచయమైన 'చిరుత' సినిమాతోనే నేహా శర్మ(Neha Sharma) కూడా హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. కానీ ఎందుకనో ఆమెకు తెలుగులో అంతగా ఆఫర్లు రాలేదు. 'చిరుత' తర్వాత తెలుగులో 'కుర్రాడు' సినిమా చేసిన ఆమె.. అనంతరం బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. హిందీలో పలు సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ క్రమంలో నేహా శర్మ.. తన తండ్రి అజిత్ శర్మ తరపున ఎన్నికల ప్రచారం కోసం రంగంలోకి దిగింది. బీహార్ కాంగ్రెస్(Congress) లో అజిత్ శర్మ సీనియర్ లీడర్. భాగల్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ప్రస్తుతం సీఎల్పీ లీడర్ గా ఉన్నారు. అలాగే ఇప్పుడు భాగల్పూర్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. దీంతో తన తండ్రి అజిత్ శర్మ తరపున నేహా శర్మ స్టార్ క్యాంపెయినర్ అయింది. ఆమె ప్రచారానికి విశేష స్పందన లభించింది. సినీ నటి కావడంతో ఆమెను చూడటానికి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. మరి నేహా శర్మ శెట్టి క్రేజ్ తన తండ్రిని గెలిపించడానికి ఏ మేరకు హెల్ప్ అవుతుందో త్వరలోనే తేలనుంది.
Also Read