ప్రభు వద్దు శింబు ముద్దు
on Apr 1, 2015
ఇండస్ట్రీలో ఎఫైర్స్-బ్రేకప్స్ ఎంత కామనో...వెంటనే మరో జోడీని వెతుక్కుని ఎగిరిపోవడమూ అంతే కామన్. కానీ ప్రభు యూ టర్న్ తీసుకున్నాడు. నయా తారొద్దు నయనతారే కావాలని పట్టుబడుతున్నాడట. ప్రియురాలి కోసం ఇల్లాలుకి విడాకులు కూడా ఇచ్చేశాడు. సెట్ లో ప్రియురాలు ఇంట్లో ఇల్లాలుగా మారుతుందిలే అనుకుంటే సీన్ రివర్సైంది. పెళ్లిపెటాకులైంది. నయన్ ఎగిరిపోయింది. దీంతో ఎవరి దారిన వాళ్లు పడ్డారు. మాజీ బాయ్ ఫ్రెండ్ శింబుతో మరో సినిమా చేస్తున్నఈ కేరళకుట్టి శింబుకి దగ్గరయ్యేందుకు ట్రై చేస్తోందని కోలీవుడ్ జనాలు కోడైకూస్తున్నారు. ఇంతలో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా మళ్లీ ప్రభు తెరపైకొచ్చాడు. నయనను ఒప్పించమంటూ ఓ నిర్మాతని రంగంలోకి దించాడట. ఆ మాట విని నయన్ కు చిర్రెత్తుకొచ్చిందట.....శింబుని అయినా క్షమిస్తా కానీ-ప్రభు ముఖం కూడా చూడనందట. దీంతో తమిళ తంబీలంతా డైలమాలో పడ్డారు. కన్నడ కస్తూరి తేజస్వినితో చాలాదూరం వెళ్లిపోయాడనే గుసగుసలు గుప్పుమన్నాయి. ఇంతలో మాజీ ప్రేయసికి మళ్లీ గాలం ఎందుకేస్తున్నాడా అని డిస్కస్ చేసుకుంటన్నారు. గాలం కాదుకదా వలేసినా మళ్లీ నయనతార చిక్కడం కష్టమే అంటున్నారు. మరి నయన్ కూడా మనసు మార్చుకుంటుందా? వెయిట్ అండ్ సీ.