నాకు ఏ పాపం తెలీదు... నా పబ్‌లో డ్రగ్స్ నిషేదం
on Jul 14, 2017

ఈ డ్రగ్స్ రాకెట్ తో తనకు ఏ మాత్రం సంబంధం లేదని నటుడు నవదీప్ మీడియాకు తెలియజేశాడు. తాను పబ్ నడుపుతున్న మాట నిజమే అయినా... ఇలాంటి మాధకద్రవ్యాల వాడకం తన పబ్ లో పూర్తిగా నిషిద్దమని ఆయన అన్నారు. తన పబ్ కు వచ్చే ఓ ఈవెంట్ మేనేజర్ కూడా ఈ డ్రగ్స్ రాకెట్ లో ఉన్నాడని, అతని దగ్గర తన ఫోన్ నంబర్ కూడా ఉండటం వల్ల ... సంబంధం లేకపోయినా... నా పేరు బయటకు వచ్చిందని నవదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజం నిలకడ మీద తెలుస్తుందనీ, అంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు నాపై వచ్చాయని, అవి నా కెరీర్ పై ప్రభావం చూపాయని, దయచేసి ఇలాంటి వాటిని మీడియా హైలైట్ చేయొద్దని నవదీప్ కోరారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



