నారా రోహిత్ పర్సనాలిటీపై వెటకారాలు..!
on Jul 6, 2016
హీరోగా విలక్షణమైన పాత్రలతోపాటు.. వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటాడనే మంచి పేరు ఉన్న కథానాయకుడు నారా రోహిత్. "సోలో" మినహా మనోడికి మరో కమర్షియల్ హిట్ లేకపోయినప్పటికీ.. నటుడిగా మాత్రం ఓ మోస్తరు పేరుంది. ఎంతమంచి పేరున్నప్పటికీ.. సక్సెస్ లు లేకపోతే ఎవరైనా జీరోనే కదా. అసలే సరైన హిట్ రావట్లేదాని బాధపడుతున్న నారా రోహిత్ కు అతడు నటించిన సినిమాల విశ్లేషణల్లో.. ప్రతిసారీ "రోహిత్ సన్నబడితే బాగుండు" అని ప్రత్యేకించి పేర్కొనడం అస్సలు నచ్చేది కాదు. తగ్గాలనుకొన్నప్పటికీ.. వరుస షెడ్యూల్స్ కారణంగా అది కుదిరేది కాదు. దాంతో మనోడి పర్సనాలిటీ గురించి వెటకారంగా మాట్లాడుకొనేవారు. ఇలా ఉంటే హీరోగా కంటిన్యూ అవ్వడం కష్టం అనుకొన్నాడో ఏమో.. అర్జెంటుగా ఓ పదికేజీల వరకూ తగ్గినట్లున్నాడు. నిన్న ఓ కార్యక్రమానికి హాజరైన రోహిత్ స్లిమ్ లుక్ అందర్నీ అమితంగా ఆకట్టుకొంది. రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "జో అచ్యుతానంద" షూటింగ్ పూర్తయ్యింది. ఇది కాకుండా "కథలో రాజకుమారి, అప్పట్లో ఒకడుండేవాడు" అనే మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి!
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)