నందమూరి హరికృష్ణ మనవడి రూపంలో ఎన్టీఆర్ మళ్ళీ పుట్టాడు
on Oct 30, 2024
దివంగత నందమూరి హరికృష్ణ(hari krishna)మనవడు తారకరామారావు(tharaka ramarao)హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం అందరకి తెలిసిందే. ఈ విషయాన్నీ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వైవీఎస్ చౌదరి(yvs chowdary)కొన్ని రోజుల క్రితం వెల్లడి చేసాడు. న్యూ టాలెంట్ రోర్స్ పై ఆయన సతీమణి గీత ఆ చిత్రాన్ని నిర్మిస్తుంది.
రీసెంట్ గా దర్శకుడు చౌదరి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన చిత్ర హీరో తారకరామారావు ని పరిచయం చేసాడు. దీంతో ఇప్పుడు తారకరామారావు కి సంబంధించిన పిక్స్ అన్ని కూడా నందమూరి అభిమానులనే కాకుండా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.నందమూరి లెగసి ని కంటిన్యూ చెయ్యబోయే పర్ఫెక్ట్ కట్ అవుట్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న ప్రోత్సాహంతో ఇండస్ట్రీ కి వచ్చి ఆయన ప్రోత్సాహం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. తన ముని మనవడు తారకరామారావు రూపంలో పెద్దాయన రామారావు గారు మరో సారి మనముందుకు వస్తున్నారు.
ఎన్టీఆర్(ntr)అనే పేరు మూడక్షరాల తారక మంత్రం.ఆరడుగుల రూపం నా హీరో తారకరామారావు ది. నందమూరి కుటుంబం నుంచి పూర్తి ఆశీస్సులు మా హీరోకి అందించాలని కోరుకుంటున్నాను.నేను అందరి హీరోల అభిమానులని ఆప్యాయంగా పలకరిస్తాను.నేను ఇప్పటి వరకు పరిచయం చేసిన హీరోలందరని ప్రేక్షకులు ఆదరించారు.ఆ విధంగానే ఈ తారకరామారావు కూడా ఆదరించాలని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్ర రావు, అశ్వని దత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.