ఎమ్మెల్యే రోజా నిర్మించిన "వన్ అవర్" షార్ట్ ఫిల్మ్ విడుదల
on Sep 22, 2016

ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా రాజకీయాలతో బిజిగా ఉన్నా కళను మాత్రం మరిచిపోవడం లేదు. కొత్త తరాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన రోజా అందుకు షార్ట్ ఫిలిమ్స్‌ను వేదికగా చేసుకున్నారు. ఇందులో భాగంగా స్కై మీడియా బ్యానర్ పతాకంపై జిబి కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాస్ చక్రవర్తి, సందీప్, లతా సంగరాజు, అనిల్ మంత్రిప్రగడ నటినటులుగా "వన్ అవర్" అనే లఘు చిత్రాన్ని నిర్మించారు. జరగబోయే విషయాలు ముందే తెలిసే ఒక యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. సస్పెన్స్‌కు తోడు పీవీఆర్ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. షార్ట్‌ఫిలిమ్స్‌కు కేరాఫ్ ఆడ్రస్‌గా నిలిచిన తెలుగువన్ సంస్థ ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ షార్ట్ ఫిలిం ఆన్‌లైన్‌లో దూసుకెళ్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



