విజయ్ దేవరకొండ స్టార్ కాదు : నాగశౌర్య
on Aug 25, 2018
ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో యువతకు దగ్గరైన నాగశౌర్య త్వరలో 'నర్తనశాల' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య స్టార్ డమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు.
'ఇప్పుడు ఎవరికీ ఫ్యాన్స్ లేరండి.. ఇది నిజం.. ప్రేక్షకులు జస్ట్ ఇష్టపడతారు అంతే.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాలోయింగ్ అంతటితో ఆగిపోయింది.. ఇప్పుడు పూజలు చేయడం ఆపేశారు.. పవన్ కళ్యాణ్ లాంటి హీరోలందరూ ఒక రేంజ్ అప్పట్లో.. ఈ కాలంలో ప్రమోషన్ అని, ఈవెంట్స్ అని తరచుగా ఆడియన్స్ కు కనిపించడంతో వాళ్ళకు హీరోలు దేవుళ్ళలా కనిపించడం లేదు.. ఒకప్పుడు ఫిలిం నగర్ కు బస్సులు వేసుకొని వచ్చేవాళ్ళు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. హీరో రోజూ ఆడియన్స్ కు కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు స్టార్ ఎలా అవుతాడు.. ఇప్పుడుండేవాళ్ళు ఎవరూ స్టార్ కారండి.. ఎవరైనా స్టార్ అని అన్నా నమ్మొద్దు' అని అన్నారు.. మరి విజయ్ దేవరకొండ ను రీసెంట్ గా అందరూ స్టార్ అంటున్నారు కదా, యూత్ లో ఫాలోయింగ్ ఉంది కదా? అని అడిగితే.. 'అది ఫాలోయింగ్ అండీ.. సస్టెయిన్ అవ్వాలి కదా? సస్టెయిన్ అయితే చాలా బెటర్.. అంతకంటే మంచిది లేదు.. అప్పట్లో తరుణ్ కు ఉన్న క్రేజ్ ఇప్పట్లో ఏ హీరోకు లేదు.. ఇప్పుడు స్టార్లు అంటూ ఎవరూ లేరు.. అది తెలుసుకుంటే బెటర్.. ఇప్పుడు పొరపాటున పది ఫ్లాపులు వస్తే హీరోగా ఆదరిస్తారా.. అందరికంటే నాకు గ్రేట్ అనిపించింది నితిన్.. తనకు 16 ఫ్లాపులు వచ్చాయి.. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి.. అందుకే నాకు నితిన్ అంటే చాలా ఇష్టం' అని అన్నారు.. నాగశౌర్య చెప్పింది నిజమే అనిపిస్తుంది కానీ ఫ్యాన్స్ నాగశౌర్య మాటలను ఎలా అర్ధం చేసుకుంటారో మరి.