'రానా నాయుడు' సరే ఇంతకీ 'దూత' ఎప్పుడు?!
on Feb 21, 2023
ప్రస్తుతం తెలుగు వారికి బాగా ఆసక్తిని కలిగిస్తోన్న వాటిలో రెండు వెబ్ సిరీస్లు ఉన్నాయి. అందులో ఒకటి దగ్గుబాటి వెంకటేష్, రానా నటిస్తున్న 'రానా నాయుడు'. ఈ వెబ్ సిరీస్ మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది అని ప్రకటించారు. దాంతో అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇక ఇప్పుడు నాగచైతన్య వంతు వచ్చింది. నాగచైతన్య ప్రస్తుతం 'దూత' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు 24 మనం వంటి చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
నాగచైతన్య విషయానికి వస్తే ఈయన 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' చిత్రాలతో జోరు మీదున్నారు. అయితే 'థాంక్యూ', 'లాల్ సింగ్ చద్దా' వంటి డిజాస్టర్లు కాస్త ఇబ్బంది పెట్టాయి. అయినా ఆ పరాజయాలు నాగచైతన్య కెరీర్ పై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రస్తుతం చైతన్య 'కస్టడీ' అనే యాక్షన్ సినిమా చేస్తున్నారు. దీనికి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకుడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ మంచి బజ్ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. అయితే 'దూత' వెబ్ సిరీస్ ఎప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందో తెలియడం లేదు. 'కస్టడీ' మరో రెండు నెలల్లో పూర్తవుతుంది.
కానీ వెబ్ సిరీస్ మాత్రం విడుదలకు నోచుకోవట్లేదు. ప్రచారం కూడా లేదు. అప్పట్లో 'దూత'కు సంబంధించిన పరిచయ చిత్రాలు విడుదల చేసినప్పుడు బాగా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు కనీసం వాటి అడ్రస్ కూడా లేకుండా పోయింది. అందరూ ఈ సిరీస్ ఒకటి ఉందని మర్చిపోయారు. మరి వెంకటేష్ రానాలు నటించిన 'రానా నాయుడు' నెట్ ఫిక్స్ లో మార్చి 10 నుండి స్ట్రీమింగ్ కానుండగా, 'దూత' సంగతి ఏమిటో అమెజాన్ ప్రైమ్ వారు వెంటనే అప్డేట్ ఇస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
