ఆంధ్రావాలా vs కెమెరామెన్ గంగ తో రాంబాబు
on Nov 29, 2012
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వలో వచిన్న సూపర్ హిట్ మూవీ "సింహాద్రి" . 2003 విడుదల అయిన ఈ మూవీ కలెక్షన్స్ సునామి సృష్టించింది. తిరుగులేని మాస్ ఇమేజ్ తీసుకొచిన "సింహాద్రి" మూవీ ఎన్టీఆర్ నీ టాప్ పోసిషన్ లో కూర్చోపెటింది. తరువాత వచ్చిన ఆంధ్రావాలా సినిమా ప్రేక్షకులకు నిరాశే మిగిచింది. ఎన్నో హంగు అర్బటాల నడుమ ఈ మూవీ 2004 విడుదల అయింది. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ఎన్టీఆర్ తాత గారు స్వగ్రామం నిమ్మకూరు లో లక్షలాది జనంలో ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ జరిగింది . టాలీవుడ్ లో ఇలాంటి ఆడియో ఫంక్షన్ జరగటం మొదటిసారి . అలాంటి ఇమేజ్ ఉన్న మాస్ హీరో , సింహాద్రి లాంటి సూపర్ హిట్ ఉన్న మూవీ , 2004 విడుదల అయిన ఆంధ్రావాలా మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.
టాలీవుడ్ లో నెంబర్ 1 రేస్ లో దూసుకుపోతున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక్క ఇమేజ్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఖుషి తరువాత వచ్చిన సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ . ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తిసుకోచింది. గబ్బర్ సింగ్ మూవీ అన్ని రికార్డ్స్ అధిగమించినిది. తరువాత వచ్చిన కెమెరామెన్ గంగ తో రాంబాబు ఎలాంటి ఆడియో ఫంక్షన్ లేకుండా సినిమా ను రిలీజ్ చేసారు. తరువాత ఎన్నో వివాదాలు నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాలేదు.
అలాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్న ఈ టాప్ హీరో లు తరువాత వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నారు . సూపర్ హిట్స్ అయిన ఆ రెండు సినిమాలు రేంజ్ కి ఈ చిత్రాలు వెళ్ళలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. సినిమాలో కథ లేకుండా కేవలం డైలాగ్స్ మరియు టేకింగ్ తో కొన్ని హిట్స్ కొట్టాడు పూరి . ఈ ఇద్దరు అగ్ర హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత ఫ్లోప్స్ ఇచ్చిన ఘనత పూరి జగన్నాద్ కే చెల్లింది .