ఎన్టీఆర్ నెల్సన్ మూవీ బిగ్ అప్డేట్..!
on Apr 13, 2025
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేతిలో మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2 దాదాపు పూర్తయింది. ఇది ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ నెలలోనే ఎన్టీఆర్ షూట్ లో పాల్గొననున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర 2 చేయనున్నాడు ఎన్టీఆర్. వీటితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ తో ఒక మూవీ కమిట్ అయ్యాడు. (NTR Nelson)
ఎన్టీఆర్, నెల్సన్ కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని లాక్ చేశారట.
నెల్సన్ సినిమాలకు ఫస్ట్ నుండి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న జైలర్ 2 కి కూడా అనిరుధ్ నే మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి కూడా లాక్ అయినట్లు సమాచారం.
ఎన్టీఆర్ గత చిత్రం దేవర కి కూడా అనిరుధ్ సంగీతం అందించడం విశేషం. దేవర మ్యూజిక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వీరి కాంబోలో మరో సినిమా అంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.
సితార బ్యానర్ తో కూడా అనిరుధ్ ట్రావెల్ అవుతున్నాడు. గతంలో జెర్సీ చేశాడు. ప్రస్తుతం కింగ్ డమ్, మ్యాజిక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ నెల్సన్ కాంబో ఫిల్మ్ కోసం భారీ రెమ్యూనరేషన్ తో అనిరుధ్ ని లాక్ చేసినట్లు వినికిడి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
