రాజశేఖర్ తో `జార్జి రెడ్డి` భామ?
on Mar 3, 2021
`జార్జి రెడ్డి` చిత్రంతో తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముస్కాన్ ఖుబ్ చాందిని. మరీ ముఖ్యంగా.. ఆమె నర్తించిన `బుల్లెట్` సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. `జార్జి రెడ్డి` తరువాత అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ `లక్ష్మి`లో కీలక పాత్రలో మెరిసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ.
కట్ చేస్తే.. తాజాగా ఈ ముద్దుగుమ్మకి ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నాయికగా నటించే అవకాశం దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. సీనియర్ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా `శేఖర్` పేరుతో ఓ సినిమా
రూపొందుతున్న సంగతి తెలిసిందే. లలిత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్థానముందట. వారిలో ఒకరిగా ముస్కాన్ ఎంపికైందని సమాచారం. అంతేకాదు.. మరో రెండు వారాల్లో అరకు (వైజాగ్) షెడ్యూల్ లో ముస్కాన్ జాయిన్ కానుందట.
మరి.. సాలిడ్ హిట్ కోసం వేచిచూస్తున్న ముస్కాన్ కి.. `శేఖర్`తో ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో `శేఖర్` సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసే అవకాశముంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
