హిందీ బెల్ట్ కి షాక్ ఇచ్చిన మిరాయ్
on Oct 4, 2025

సెప్టెంబర్ 5 న పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి ఘన విజయాన్ని అందుకున్న చిత్రం 'మిరాయ్'(Mirai).శ్రీరాముడు ఆయుధమైన మిరాయ్ కి, కళింగ సామ్రాట్ అశోకుడి శక్తులకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే పాయింట్ తో తెరకెక్కి, అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. తేజ సజ్జ(Teja Sajja)మంచు మనోజ్(Manchu Manoj)శ్రేయ, రితికా నాయక్, జగపతి బాబు, కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni)టిజె విశ్వప్రసాద్(TG Vishwa Prasad)వంటి ప్రతిభావంతుల కలయికతో అద్భుతమైన చిత్రంగా నిలవడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని 'విశ్వవ్యాప్తం' చేసింది.
ఇక ఈ చిత్రం ఓటిటి మూవీ లవర్స్ ని కనువిందు చెయ్యడానికి రెడీ అవుతుంది. జియో హాట్ స్టార్(JIo Hotstar)వేదికగా అక్టోబర్ 10 నుంచి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జియో హాట్ స్టార్ అధికారకంగా వెల్లడి చేసింది. కాకపోతే హిందీ ఓటిటి డేట్ మాత్రం వెల్లడి చెయ్యలేదు. ఒక రకంగా హిందీ ప్రేక్షకులకి డిజప్పాయింట్ కలిగించే న్యూస్ అని చెప్పవచ్చు. తేజ సజ్జ గత చిత్రం 'హనుమాన్' హిందీలో భారీ వసూళ్ళని రాబట్టడమే కాకుండా, ఓటిటి లో కూడా స్ట్రీమింగ్ పరంగా మంచి వ్యూస్ ని రాబట్టింది. ఇప్పుడు మిరాయ్ కూడా నార్త్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది. మరి హిందీ ఓటిటి డేట్ త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి.
ఐదు వారాల్ని పూర్తి చేసుకోబోతున్న 'మిరాయ్' ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ వద్ద వీకెండ్స్ లో తన సత్తా చాటుతునే ఉంది. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, ఇప్పటి వరకు 140 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మరి ఓటిటి లో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



