చిరంజీవి, బాలకృష్ణ మధ్య మళ్ళీ ఫైట్.. రామ్ చరణే కారణం..!
on Jun 21, 2024

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మధ్య బాక్సాఫీస్ వార్ కి తెలుగునాట ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి ఈ ఇద్దరూ తలబడితే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఇప్పటికే పదిసార్లు నువ్వా నేనా అన్నట్టుగా పొంగల్ వార్ కి దిగారు. ఇప్పుడు పదకొండవసారి సంక్రాంతి సమరానికి సై అంటున్నారు.
చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' (Vishwambhara). యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే వచ్చే సంక్రాంతి సీజన్ పై బాలయ్య కూడా కర్చీఫ్ వేస్తున్నాడు.
బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట దసరాకు విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా బాలయ్య కొద్దిరోజులు బ్రేక్ తీసుకోవడంతో షూటింగ్ ఆలస్యమైంది. దీంతో ఈ సినిమాని డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అదే టైంకి రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) వచ్చే అవకాశముంది. సంక్రాంతి సీజన్ లో రెండు మూడు పెద్ద సినిమాలు తలబడినా సమస్య లేదు కానీ.. డిసెంబర్ లో పెద్ద సినిమాలు తలబడితే ఏదో ఒక సినిమా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే డిసెంబర్ లో 'గేమ్ ఛేంజర్' విడుదల ఉంటే.. 'NBK 109' ను సంక్రాంతికి తీసుకు రావాలని మేకర్స్ చూస్తున్నారట. అదే జరిగితే మరోసారి చిరు-బాలయ్య మధ్య పొంగల్ వార్ తప్పదు. చివరగా 2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి, 'వీరసింహారెడ్డి' బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ కి దిగారు. ఈ ఫైట్ లో 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ గా నిలవగా, 'వీరసింహారెడ్డి' సూపర్ హిట్ అనిపించుకుంది. మరి ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే, ఒకవేళ బాలకృష్ణ సినిమా సంక్రాంతికి వస్తే.. రవితేజ సినిమాపై ప్రభావం పడే అవకాశముంది. రవితేజ 75వ సినిమా కూడా సితార బ్యానర్ లోనే రూపొందుతోంది. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ సంక్రాంతి బరిలో 'NBK 109' నిలిస్తే.. రవితేజ 75వ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



