దిమ్మతిరిగిపోయేలా మెగాస్టార్ లైనప్!
on Dec 4, 2024
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్, వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. దీని తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు మెగాస్టార్. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ చేస్తున్నారు. ఎస్.ఎల్.వి. సినిమాస్, యునానిమస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీని తాజాగా ప్రకటించారు. ఇందులో చిరంజీవిని వయలెంట్ గా చూపించబోతున్నాడు శ్రీకాంత్. ఇక దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం వెంకటేష్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. దీని తర్వాత చిరంజీవితో ఓ సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, అనిల్ చెప్పిన స్టోరీకి మెగాస్టార్ ఇంప్రెస్ అయ్యారని సమాచారం. అంతేకాదు, బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'భగవంత్ కేసరి'ని నిర్మించిన షైన్ స్క్రీన్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనుందట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు. అనిల్-చిరంజీవి కాంబో మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. ఈ తరంలో బెస్ట్ కామెడీ డైరెక్టర్స్ లో ఒకరిగా అనిల్ పేరు తెచ్చుకున్నాడు. ఇక చిరు కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఈ ఇద్దరు కలిస్తే అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనడంలో సందేహం లేదు.
శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి తర్వాత సందీప్ రెడ్డి వంగాతోనూ మెగాస్టార్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందట. అదే జరిగితే చిరంజీవిది క్రేజీ లైనప్ అవుతుంది. వశిష్టతో సోషియో ఫాంటసీ ఫిల్మ్, శ్రీకాంత్ ఓదెలతో యాక్షన్ ఫిల్మ్, అనిల్ రావిపూడితో ఎంటర్టైనర్ ఇలా విభిన్న జానర్స్ తో చిరంజీవి అలరించనున్నారు. అలాగే సందీప్ రెడ్డి కూడా అదిరిపోయే యాక్షన్ సినిమా చేసే అవకాశముంది.