చిరు-పవన్ సినిమాలో నాగబాబు కూడానా..?
on Feb 7, 2017
చిరంజీవి, పవన్ కాంభినేషన్లో టాలీవుడ్ మల్టీస్టారర్ హిస్టరీలోనే మోస్ట్ మెమురబుల్ మూవీని తెరకెక్కించేందు ప్లాన్ చేశారు కళాబంధు, ఎంపీ, టీ.సుబ్బిరామిరెడ్డి. ఈ మ్యాటర్ రివీల్ చేసినప్పటి నుంచి సినిమా ఎలా ఉండబోతుందా..? కధేంటి..? హీరోయిన్లు ఎవరుంటారు అంటూ అభిమానుల్లో ఒకటే చర్చ..ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చే వార్త ఒకటి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో మరో మెగా హీరో నాగబాబు కూడా నటించబోతున్నారంట. ముగ్గురు అన్నదమ్ములు గతంలో శంకర్‌దాదా జిందాబాద్ సినిమాలో కనిపిస్తారు..కానీ ముగ్గురు ఒకేసారి కనిపించరు..అలాంటిది తొలిసారి ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం మెగా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విషయం. అయితే ఈ వార్తను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి కథను సిద్ధం చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.
Also Read