'మెగా 154'.. బాస్ వస్తున్నాడు!
on Oct 20, 2022
ఇటీవల 'గాడ్ ఫాదర్'తో ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన కెరీర్ లో 154వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ దీపావళికి టైటిల్ టీజర్ రాబోతోంది.
'మెగా 154' చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ తాజాగా 'బాస్ వస్తున్నాడు' అంటూ టైటిల్ టీజర్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. దీపావళి కానుకగా అక్టోబర్ 24న ఉదయం 11:07కి టైటిల్ టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. 'వాల్తేరు వీరయ్య' అనే టైటిలే ఖరారు చేశారో లేక మరేదైనా టైటిల్ తో సర్ ప్రైజ్ చేస్తారో అనేది ఈ దీపావళికి తేలిపోనుంది.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 2023 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
