మెగా విలన్ సెట్ అయ్యాడు!
on Jul 28, 2016
.jpg)
ఎట్టలేకలకు చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి కన్ఫర్మ్ అయ్యింది. హీరోయిన్ కాదులెండి.. కథలో అంతకంటే కీలకమైన ప్రతినాయకుడ్ని ఇప్పటికీ ఫైనల్ చేశారు. తొలుత తమిళ వెర్షన్ లో విలన్ గా నటించిన నీల్ నితిన్ నే విలన్ గా అనుకొన్నారు, ఆ తర్వాత మన తెలుగు హీరో టర్నడ్ పాపులర్ విలన్ జగపతిబాబును దాదాపుగా ఫైనల్ చేసేశారనుకొన్న సమయంలో "నన్ను ఇంకా ఫైనల్ చేయలేదంటూ" జగపతిబాబు స్వయంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. దాంతో విలన్ ఎవరా అనే విషయంలో మళ్ళీ సందిగ్ధత మొదలైంది.
కట్ చేస్తే.. బాలీవుడ్, టాలీవుడ్ లను పక్కనపెట్టి కోలీవుడ్ విలన్ అయిన తరుణ్ అరోరా అనే నటుడ్ని మెగా 150వ సినిమా కోసం విలన్ గా ఫైనల్ చేశారట. జగపతిబాబు భారీ పారితోషికం అడగడంతో.. అతని స్థానంలో తెలియకపోయినప్పటికీ కాస్త అటుఇటుగా జగపతిబాబును పోలి ఉండే తరుణ్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. త్వరలోనే తరుణ్ అరోరా మెగా మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇదో ఊపులో హీరోయిన్ ఎవరనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేస్తే మెగా ఫ్యాన్స్ కి టెన్షన్ తగ్గుతుంది!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



