మాస్ జాతరకు షాకింగ్ కలెక్షన్స్..!
on Nov 3, 2025

ఓ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ.. రీసెంట్ గా 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించారు. అక్టోబర్ 31 సాయంత్రం ప్రీమియర్ షోలతో ఈ చిత్రం థియేటర్లలో అడుగు పెట్టింది. విడుదలకు ముందు పెద్దగా బజ్ లేదు. థియేట్రికల్ బిజినెస్ కూడా సేఫ్ జోన్ లో జరిగింది. అయితే రవితేజకు అచ్చొచ్చిన యాక్షన్ కామెడీ జానర్ లో 'మాస్ జాతర' రూపొందడంతో.. ఈ సినిమాతో ఆయన కమ్ బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ మూవీకి వస్తున్న కలెక్షన్స్ షాకింగ్ గా ఉన్నాయి. (Mass Jathara)
మాస్ జాతర మూవీ రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. రవితేజ లాంటి స్టార్ నటించిన సినిమా రూ.20 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు. దీంతో 'మాస్ జాతర' మూవీ బజ్ తో సంబంధం లేకుండా.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, మొదటి షో నుండే డివైడ్ టాక్ రావడంతో.. ఇప్పుడు ఆ చిన్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా కొండంతలా కనిపిస్తోంది.
Also Read: జర్నీ సినిమాని గుర్తు చేస్తున్న వరుస బస్సు ప్రమాదాలు!
ట్రేడ్ లెక్కల ప్రకారం.. మొదటి రెండు రోజుల్లో 'మాస్ జాతర' చిత్రం రూ.7 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అంటే హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. మరో రూ.13 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో మూడు కోట్లకు మించి కలెక్ట్ చేసే ఛాన్స్ లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పలుసార్లు వాయిదా పడటం, ప్రమోషనల్ కంటెంట్ రెగ్యులర్ గా ఉండటంతో 'మాస్ జాతర'పై విడుదలకు పెద్దగా బజ్ రాలేదు. పైగా అక్టోబర్ 31 విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని 'బాహుబలి: ది ఎపిక్' కారణంగా ఒక రోజు పోస్ట్ పోన్ చేశారు. దీంతో మూడు రోజుల ఫస్ట్ వీకెండ్ కాస్తా, రెండు రోజులకు పరిమితమైంది. దానికి తోడు పాజిటివ్ టాక్ రాకపోవడంతో.. ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇలాంటి ప్రతికూల అంశాలతో మాస్ జాతర మూవీ ఫుల్ రన్ లో రూ.10 కోట్ల షేర్ కి పరిమితమయ్యే అవకాశముంది అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



