విజయ్ దేవరకొండతో అమెరికన్ నటి.. రష్మిక క్యామియో అని తెలుసా
on Mar 23, 2024
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ(vijay deavarakonda) నయా మూవీ ఫ్యామిలీ స్టార్( fyamily star) ఏప్రిల్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.ఈ మేరకు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాటు రెండు సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. అంతే కాకుండా మూవీ మీద అంచనాలని కూడా పెంచాయి. తాజాగా ఫ్యామిలీ స్టార్ కి సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారింది.
ప్రముఖ అమెరికన్ నటి మరిస్సా రోజ్ గోర్డాన్ (marissa rose gordon)ఫ్యామిలీ స్టార్ లో ఒక కీలక పాత్రలో నటిస్తుందనే టాక్ వినపడుతుంది. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ది గ్రేవ్, బ్లడ్ అండ్ బోన్,బ్లాక్ హార్ట్, వైల్ సిటీ లాంటి చిత్రాలు ఆమెకి పేరు తెచ్చాయి. మైండ్ ఓవర్ మర్డర్ అనే టీవీ సిరీస్ కూడా ఆమెకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది.ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలకి కాస్టింగ్ డైరెక్టర్ గాను వర్క్ చేసింది. మరి అంతటి పేరు కలిగిన మరిస్సా ఫ్యామిలీ స్టార్ లో ఎలాంటి క్యారక్టర్ లో కనపడబోతుందనే క్యూరియాసిటీ అందరిలోను ఉంది.అదే టైం లో మేకర్స్ ఆ మూవీని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో కూడా అర్ధం అవుతుంది.
విజయ్ సరసన టాప్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (mrunal thakur) జతకట్టింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు (dil raju) అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. పరశురామ్( parasuram) దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఇంతకు ముందు విజయ్, పరశురామ్ కాంబోలో గీత గోవిందం వచ్చి మంచి విజయాన్ని సాధించింది. దీంతో అందరిలో ఫ్యామిలీ స్టార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmikha) ఒక సాంగ్ లో క్యామియో అప్పియరెన్స్ ఇవ్వనుంది. అంటే ఒక పాటలో కొద్దీ సేపు మెరవబోతుంది.మరో యువ నటి దివ్యాంశ కౌశిక్ కూడా ఒక ముఖ్య పాత్రని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
Also Read