పంచదార తో కరెంట్ అపారని పోలీసులని ఆశ్రయించిన మంచు మనోజ్
on Dec 16, 2024
మంచు కుటుంబంలోని గొడవలు తెలుగు ప్రజల్లో ఎంతగా సంచలనం సృష్టించాయో అందరకి తెలిసిందే.ఆ గొడవల్లో మోహన్ బాబు(mohan babu)వల్ల ఒకజర్నలిస్ట్ గాయపడటం,అతనికి
సారీ చెప్పిన మోహన్ బాబు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడమే కాకుండా వైద్యానికి అయ్యే ఖర్చుని కూడా తనే చూసుకుంటున్నాడు.మంచు కుటుంబలోని గొడవలు కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా సద్దుమణుగుతున్నాయి.ఈ విషయంలో మోహన్ బాబుతో సహా
మనోజ్,(manoj)విష్ణు(vishnu)లు పోలీసులకి ఎలాంటి గొడవలు జరగవని హామీ కూడా ఇచ్చారు.
కానీ నిన్నఅర్ధరాత్రి మా అన్న విష్ణు మా ఇంట్లో ఉన్న జెనరేటర్ లో చక్కెర పోసి,మా ఇంటికి కరెంట్ రాకుండా చేసాడు,తక్షణమే మా అన్న మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ మనోజ్ పహాడ్ షరీఫ్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది.దీంతో ముందు ముందు ఈ వ్యవహారం ఎలాంటి మలుఫు తీసుకుంటుందో చూడాలి.
Also Read