100 కోట్లతో విష్ణు మైక్రో చిత్రం.. మీ దగ్గర ఫోన్ ఉంటే చూసేయచ్చు
on Aug 22, 2025

నటప్రపూర్ణ పద్మశ్రీ మంచు 'మోహన్ బాబు'(Mohan Babu)నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన విష్ణు(Vishnu),సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా హిస్టారికల్ మూవీ 'కన్నప్ప'(Kannappa)తో వచ్చి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'కన్నప్ప' విష్ణుకి సరికొత్త ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసింది.
ఎంటర్ టైన్ మెంట్ రంగంలో నూతన ఒరవడిని సృష్టించడానికి విష్ణు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొబైల్ వినియోగదారులకి సినిమాటిక్ అనుభవాన్ని పంచేలా, మైక్రోడ్రామా(Micro Drama) అనే చిత్రాలని నిర్మించబోతున్నాడు. మూడు నుంచి ఏడు నిమిషాల నిడివితో సదరు మైక్రో డ్రామా చిత్రాలు ఉండనున్నాయి. దీంతో ఇవి భారతీయ వినోద రంగంలో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తాయని విష్ణు నమ్ముతున్నాడు. వంద కోట్ల నిర్మాణ వ్యయంతో వీటిని రూపొందించబోతున్నారు. మైక్రో డ్రామా చిత్రాలని చైనా ప్రారంభించగా, యునైటెడ్ స్టేట్స్ తో పాటు మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే విశేష ఆదరణ పొందుతు, బిలియన్ డాలర్ల పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది.
విష్ణు అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే, కన్నప్ప తో ఏర్పడిన సరికొత్త ఇమేజ్ దృష్ట్యా, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న సబ్జెట్స్ లోనే విష్ణు చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్నిరోజుల్లో ఈ విషయంపై అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. హీరోగానే కాకుండా నిర్మాతగాను విష్ణు తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



