అయోధ్యరాముడి విషయంలో మంచు మనోజ్ కీలక నిర్ణయం
on Sep 22, 2025

'రాకింగ్ స్టార్' గా అశేష తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు మంచు మనోజ్(Manchu Manoj). 'మిరాయ్'(Mirai)తో తన రూటు మార్చుకొని ప్రతినాయకుడుగా కనపడ్డాడు. 'మహాభీర్ లామా' క్యారక్టర్ ని అద్భుతంగా పోషించి, పాన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసాడు. మనోజ్ కోసమే రిపీట్ ఆడియెన్స్ మిరాయ్ కి వెళ్తున్నారంటే తన నట విశ్వరూపం ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మనోజ్ హిందువుల ఆరాధ్యదైవమైన 'అయోధ్య శ్రీరాముడిని(Ayodhya Sriramudu)దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా అయోధ్య(Ayodhya)లో మనోజ్ మాట్లాడుతు 'అయోధ్య రావడం సంతోషంగా ఉంది. ఇక్కడికి రావాలనేది కూడా నా కల. శ్రీరాముడు యుద్ధంలో గెలిచి ఇక్కడికి వచ్చాడు. మేము కూడా సినిమా యుద్ధంలో గెలిచి విజయం సాధించి వచ్చాం. దర్శనం అద్భుతంగా జరిగింది అమవాస్య రోజు దర్శనం మంచిదని స్వామిజీలు చెప్పారు. మరోసారి అయోధ్యకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వస్తాను. మీరంతా అయోధ్య శ్రీరాముడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాను. అయోధ్య నుంచే మిరాయ్ సక్సెస్ టూర్ ని ప్రారంభిస్తున్నామని మనోజ్ చెప్పాడు. ఆలయ ఆవరణలోనే ఉన్న హనుమాన్ గఢీని కూడా దర్శించి పూజలు చేసాడు.
'శ్రీరాముడు' ఆయుధమైన 'మిరాయ్' కి కళింగ యుగం నాటి 'అశోకుడు' శక్తులకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే పాయింట్ తోనే 'మిరాయ్' తెరకెక్కింది. కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni)దర్శకత్వం ప్రతిభ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media factory)నిర్మాణ విలువలు, తేజసజ్జ, రితిక నాయక్, శ్రీయ, జగపతి బాబు తమ నటనతో మిరాయ్ ని హిట్ దిశగా నడిపించారు. ఇక మనోజ్ కి పాన్ ఇండియా లెవల్లో పలు చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



