మంచు మనోజ్ విడాకులు తీసుకున్నాడు
on Oct 17, 2019

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్ విడాకులు తీసుకున్నాడు. ట్విట్టర్ వేదికగా బాధాతప్త హృదయంతో ఈ రోజు ఆ విషయాన్ని ప్రకటించాడు. ఇద్దరి మధ్య డిఫరెన్సులు రావడంతో విడాకులు తీసుకున్నట్టు మనోజ్ తెలిపాడు. ఈలోపు చాలా బాధకు గురైనట్టు పేర్కొన్నాడు. ఇద్దరం వేరు పడాలని, జీవితంలో ముందు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. ఇన్నాళ్లు యాక్టింగ్, సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం వ్యక్తిగత జీవితంలో ఒడిడుకులు కారణమన్నట్టు మనోజ్ వ్యాఖ్యలు ఉన్నాయి. మనసు బాలేకపోవడం వలనే సినిమాలపై దృష్టి సారించాలేకపోయానని అతడు అన్నాడు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు తనకు అండగా నిలబడ్డారని తెలిపాడు. మళ్ళీ త్వరలో సినిమాల్లోకి వస్తున్నట్టు, నటించబోతున్నట్టు మనోజ్ స్పష్టం చేశారు. తనకు తెలిసింది, తాను ప్రేమించేది సినిమాల్లో నటించడమేనని అన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



