అల్లు అర్జున్ కి పోటీగా మంచు విష్ణు.. తగ్గేదేలే!
on Jun 18, 2024
ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' (Pushpa 2) చిత్రం డిసెంబర్ 6కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకి.. డిసెంబర్ లో సోలో రిలీజ్ దొరకడం కష్టమే అంటున్నారు. రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) ను డిసెంబర్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అది కూడా భారీ పాన్ ఇండియా సినిమా కావడంతో.. 'పుష్ప-2' కి గట్టి పోటీనే అవుతుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు అనూహ్యంగా మరో సినిమా తెరపైకి వచ్చింది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప' (Kannappa). మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ప్రభాస్ (Prabhas) తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలలో మెరవనున్నారు. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అదే జరిగితే 'పుష్ప-2' వసూళ్లపై ఎంతోకొంత ప్రభావం పడే అవకాశముంది. ఎందుకంటే 'కన్నప్ప' అసలే పాన్ ఇండియా మూవీ. దానికి తోడు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ ఉన్నారు. దాంతో ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఊహించని మ్యాజిక్ చేసినా ఆశ్చర్యంలేదు. అలా అని 'పుష్ప-2'ని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు.
అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప-1'.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అందుకే దానికి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప-2' పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే.. వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే అంచనాలున్నాయి. మరి 'కన్నప్ప' నిజంగానే డిసెంబర్ లో విడుదలైతే 'పుష్ప-2' ప్రభంజనానికి ఏ మేరకు అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.
Also Read