జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్
on Jan 2, 2026

-మెగా అండ్ విక్టరీ జోరు
-ఫ్యాన్స్ హుంగామా
-అధికారకంగా వెల్లడి చేసిన మేకర్స్
-నయన తార వీడియో వైరల్
సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు జనవరి 12 కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది.
మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ జనవరి 4 న విడుదల కాబోతుంది. మేకర్స్ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారంగా డేట్ ని అనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పొడవాటి గన్ తో మోకాలిపై కూర్చున్న చిరంజీవి లుక్ విశేషంగా ఆకర్షిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి అభిమానులు ట్రైలర్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తు వస్తున్నారు. దీంతో రిలీజ్ డేట్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే టీజర్,సాంగ్స్ తో అంచనాలని రెట్టింపు చేసుకున్న మన శంకర వరప్రసాద్ ట్రైలర్ తో ఆ అంచనాలని బద్దలు కొట్టడం ఖాయమనే మాటలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
Also read: చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా
ప్రస్థుతానికి అయితే మనశంకర వరప్రసాద్ శరవేగంగా మిగతా కార్యక్రమాలని పూర్తి చేసుకుంటున్నాడు, రిలీజ్ డేట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో స్టార్ట్ అయ్యాయి. చిరు సరసన నయనతార జతకట్టగా ఎప్పుడు లేని విధంగా మన శంకర వరప్రసాద్ ప్రమోషన్స్ కి నయనతార(Nayanthara)హాజరు కానుంది.ఇందుకు సంబంధించి నయనతర స్వయంగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దగ్గరకి వచ్చి ప్రమోషన్స్ ఎప్పుడు అని అడగటం, అనిల్ రావిపూడి కళ్ళు తిరిగి పడిపోవడం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు నవ్వులు పూయిస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



