ఓటిటి లోకి వచ్చేస్తున్నా.. డేట్ ఇదే !
on Jan 31, 2026

-థియేటర్స్ లో ఇంకా తగ్గని మన శంకర వరప్రసాద్ జోరు
-మరి ఓటిటి అప్ డేట్ ఏంటి!
-ఈ డేట్ కి ఓకే అయ్యిందా!
-జీ 5 నుంచి అధికార ప్రకటన రానుందా!
ఇక ఏ సంవత్సరం అయినా సంక్రాంతి రానివ్వండి. 2026 సంక్రాంతిని మాత్రం మెగా, విక్టరీ,అనిల్ రావిపూడి అభిమానులు,తెలుగు సినిమా ప్రేమికులు మర్చిపోలేరు. అంతలా మన శంకర వరప్రసాద్ గారు తన మాయాజాలంతో మెస్మరైజ్ చేసాడు. అచ్చ తెలుగువంటకాలతో భోజనం చేసి సుమారు సంవత్సరం అవుతున్న వ్యక్తికి ఆహ్లాదకరమైన వాతావరణంలో అరిటాకు వేసి కమ్మని తెలుగు వంటకాలతో విత్ నెయ్యి, గడ్డ పెరుగుతో భోజనం పెడితే ఎంతటి పరమానందాన్ని పొందుతాడో,మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara varaprasad Garu)చూసిన ప్రేక్షకుడు కూడా అంతే ఆనందపడుతున్నాడు. అందుకే సదరు ప్రేక్షకుడు మూడో వారం కూడా నిండకుండానే 350 కోట్ల గ్రాస్ దాకా కట్టబెట్టాడు.
ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు తెలుగు ప్రేక్షకుడికి మరింత దగ్గరయ్యేలా ఓటిటి వేదికగా రావడానికి ముస్తాబు అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టుగా సినీ సర్కిల్స్ టాక్. ఓటిటి రైట్స్‌ని పొందిన z5 నుంచి అధికార ప్రకటన కూడా రెండు మూడు రోజుల్లో రావచ్చని అంటున్నారు. అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లోను డబ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తారనే టాక్ కూడా ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతుంది.
Also read: కాంతార చాప్టర్ 1 మేకర్స్ తో మారుతి మూవీ !.. అణువిస్ఫోటనం పక్కా
మరి థియేటర్స్ లో రఫ్ఫాడిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు ఓటిటి లో రఫ్ఫాడించడం ఖాయం. ఈ నేపథ్యంలో ఓటిటి హిస్టరీ లో తన రికార్డుని ఏమేర ఉంచుకోబోతాడో చూడాలి. ప్రస్తుతానికి అయితే థియేటర్స్ లో స్టడీ కలెక్షన్స్ నే రాబడుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



