Malayali From India Review : మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీ రివ్యూ
on Jul 5, 2024
మూవీ: మలయాళీ ప్రమ్ ఇండియా
నటీనటులు: నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్, మంజు పిల్లై, దీపక్ జెథీ, సలీం కుమార్, షైన్ టామ్ చాకో, సంతోష్ జి. నాయర్ తదితరులు
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రఫీ: సుదీప్ ఎలామన్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
నిర్మాతలు: లిస్టిన్ స్టీఫెన్
దర్శకత్వం: డిజో జోస్ ఆంటోనీ
ఓటీటీ : సోనీ లివ్
కథ :
ఈ కథ కేరళలోని ముల్లకర్ లో మొదలవుతుంది. గోపీ, మల్ఘోష్ ఇద్దరు మంచి స్నేహితులు. ఇరవై ఏళ్లు దాటినా ఇద్దరు ఖాళీగా ఉంటు ఓ జాతీయపార్టీకి కార్యకర్తలాగా ప్రచారం చేస్తూ.. ఊళ్ళో వాళ్ళతో గొడవలు పడుతుంటాడు. అలా ప్రతీ రోజు వాళ్ళ అమ్మకి ఇబ్బంది కలిగిస్తాడు గోపీ. ఒకరోజు వాళ్ళ అపోజిషన్ పార్టీ మీటింగ్ రోజు గ్రౌండ్ నుండి బాల్ తో వారి కార్యాలయం ఆఫీస్ అద్దాలు పగలగొడతాడు గోపీ. దాంతో రెండు పార్టీల మధ్య గొడవ మొదలవుతుంది. ఇక కొన్ని రోజులకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అందులో ఇండియా ఓడిపోయి పాకిస్తాన్ గెలుస్తుంది. అయితే అదే ఊళ్ళో ఉంటున్న కొందరు ముస్లీంలు టపాకాయలు కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. దాంతో గోపీ తన ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వెళ్ళి బాంబ్ పేలుస్తాడు. దాంతో ముస్లీంలు తీవ్రంగా గాయపడతారు. దాంతో అక్కడ హిందూ-ముస్లీం గొడవలు జరుగుతాయి. అవి తీవ్రరూపం దాల్చడంతో గవర్నమెంట్ రాష్ట్రపతి పాలన విధిస్తుంది. అయితే వీటికి కారణమైన గోపీ, అతని స్నేహితుడు వేరు వేరు చోట్ల దాక్కుంటారు. ఇక గోపీ వాళ్ళ అమ్మ తన అన్నయ్యతో మాట్లాడి విదేశాలకి పంపిస్తుంది. అక్కడ చుట్టూ ఎడారి మధ్యలో ఆఫీస్ దాంతో గోపీకి ఏం చేయాలో అర్థం కాదు. విదేశాలకి వెళ్ళిన గోపీ ఏం చేశాడు? తన స్నేహితుడు మల్ఘోష్ ఏం అయ్యాడు? ఎడారిలోని ఆఫీస్ లో గోపీతో పాటు ఉన్న ముస్లీం సహోద్యోగి కోసం అతను ఏం చేశాడనేది మిగతా కథ
విశ్లేషణ:
'మలయాళి ఫ్రమ్ ఇండియా' ఈ సినిమా కథకి సరైన టైటిల్ అనిపించేలా సాగుతుంది. ఎందుకంటే ఎక్కడో కేరళలోని ముల్లకర్ లో ఉండే ఓ ఆకాతాయి గోపీ విదేశాలకి వెళ్ళడం, అక్కడ తనకి తగిలిన ఓ మస్లీం స్నేహితుడి కోసం పాకిస్తాన్ వెళ్ళడం.. ఆ జర్నీ ప్రతీ ఒక్కరిని ఇన్ స్పైర్ చేస్తుంది. ఇది యథార్థంగా జరిగిన కథ. దానినే బేస్ చేసుకొని దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ తెరకెక్కించి విజయం సాధించాడు.
స్నేహం కోసం ప్రాణం ఇస్తామని చూపిస్తూ, మరోవైపు మానవత్వం గుబాళించిన వేళ మనిషి తనలో తాను దైవాన్ని వెతుక్కుంటాడు. అదే జరిగింది. అసలు అడ్రెస్ తెలియని ఊరికి హీరో వెళ్ళడం అక్కడ అతనికి తీవ్రమైన ఆరోగ్య సమస్య రావడంతో ఓ మస్లీం అతను సహాయం చేయడం.. దానికి హీరో ఫిధా అవ్వడం.. చూసే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు.
సినిమాలో వాస్తవికతను చూపించడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఎందుకంటే సినిమా నిడివి రెండు గంటల ముప్పై నిమిషాలు.. దీనిలో మొదటి ముప్పై నిమిషాలు క్యారెక్టర్స్ పరిచయం చేయడానికే తీసుకున్నాడు. ఇక అసలు కథ అంతా హిందూ-ముస్లీం అల్లర్ల నుండి మొదలవుతుంది. ఇక గోపీ విదేశాలకు వెళ్ళాక కథనం పరుగులు పెడుతుంది. ఓ సినిమాలో ఆడియన్ చూడాలనుకున్నదంతా ద్వితీయార్థంలో దాచేశాడు దర్శకుడు. అయితే చాలామంది సగం సినిమా చూడగానే ఓ కన్ క్లూజన్ కి వచ్చేస్తారు. చివరి నలభై నిమిషాలు సినిమాకి అదనపు బలం. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు.. అసభ్య పదజాలం ఎక్కడ వాడలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.
హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అనవసరమనిపిస్తుంది. ఫస్టాఫ్ లోనే రెండు పాటలు వస్తాయి. అవి కూడా మలయాళంలోనే ఉండటంతో తెలుగు ఆడియన్స్ స్కిప్ చేస్తే బాగుంటుంది. ఏం పనిచేయని సోంభేరి.. ఓ స్నేహితుడు చేసిన పనికి ఎలా మారాడు అనే థీమ్ బాగుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుంటుంది. సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ పర్లేదు. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు :
గోపీ పాత్రలో నవీన్ పౌలీ, మల్ఘోష్ గా ధ్యాన్ శ్రీనివాసన్, కృష్ణ పాత్రలో అనస్వర రాజన్ ఆకట్టుకున్నారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
ఫైనల్ గా :
ఫస్టాఫ్ స్కిప్ చేస్తే సినిమా మస్ట్ వాచెబుల్. యథార్థ సంఘటనల ద్వారా తీసిన ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూసేయ్యండి.
రేటింగ్ : 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్
Also Read