మహేశ్ పై వర్మ మోజు!
on May 14, 2015
మహేశ్ బాబు సో సెక్సీ...ఎంత అంటే సన్నీ లియోన్ కన్నా 10రెట్లు. బాబోయ్ మహేశ్ బాబుకి-సన్నీ లియోన్ కి పోలికేంటి? ఇంత మాట అన్న అమ్మాయి ఎవరు అంటారా? అమ్మాయి అంటే వింతేముంది....వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ కామెంట్ ఇది. వర్మ కళ్లు మహేశ్ పై పడ్డాడేంటా అని ఆరాతీస్తే...తన శిష్యుడు పూరీజగన్నాధ్ కోసమట. పూరీ ముచ్చటగా మూడోసారి మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు. అయితే ఆ కథని తాను విన్నానని అది పోకిరి, దూకుడు కన్నా సూపర్ హిట్టవుతుందని ట్వీట్ చేశాడు వర్మ. అక్కడితో ఆగితే వర్మెందుకు అవుతాడు చెప్పండి...మహేశ్-పూరీ సినిమా బాహుబలికి పదిరెట్లు బావుంటుందని ఇన్ డైరెక్ట్ గా రాజమౌళిపై సెటైర్స్ వేశాడు. కొత్త సినిమా సంగతి పూరీ ట్వీట్ చేసిన వెంటనే రామూ ఇలా స్పందించడం ప్రిన్స్ అభిమానులను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అయితే సన్నీలియోన్ కన్నా మహేశ్ సెక్సీగా కనిపిస్తాడని చెప్పడం వర్మ అతి కాకపోతే ఏంటి మరి!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
