'సముద్రఖని'కి కళ్ళజోళ్ళ షాపే కొనివ్వొచ్చు
on May 10, 2022
కోలీవుడ్ లో డైరెక్టర్ గా, యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని కొంతకాలంగా తెలుగులో వరుస భారీ సినిమాలలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట'లోనూ ఆయన ఓ పవర్ ఫుల్ రోల్ లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో లుక్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన మహేష్ సినిమాలో సముద్రఖని పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"ఈ సినిమాలో సముద్రఖని గారు టెర్రిఫిక్ గా చేశారు. నిజానికి ఆ క్యారెక్టర్ కాస్టింగ్ విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా డిస్కస్ చేశాం. సముద్రఖని గారైతే బాగుంటుందని సజెస్ట్ చేశాను. డైరెక్టర్ కూడా ఆయన పర్ఫెక్ట్ ఛాయిస్ అనుకున్నారు. ఆయన సినిమాలో అదరగొట్టేశారు" అని మహేష్ అన్నారు.
"సినిమా అంతా చేశాక.. ఓసారి సముద్రఖని గారు నాతో.. ఈ సినిమాలో మీరు వాడిన కళ్ళజోడు ఇవ్వండి, నాకు కళ్ళజోళ్ళంటే ఇష్టం, మీ గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటాను అన్నారు. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన పర్ఫామెన్స్ అంతా చూశాను. ఆయనకు ఒక్క కళ్ళజోడు ఏంటి?.. కళ్ళజోళ్ళ షాపే కొనివ్వొచ్చు అనిపించింది. అంతా బాగా చేశారు" అని మహేష్ ప్రశంసించారు.
Also Read