శ్రీమంతుడు వెనుక బిలిగేట్స్
on Jul 29, 2015
ప్రభాస్ తో మిర్చి లాంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమా తీసిన కొరటాల శివ, మహేష్ ని శ్రీమంతుడిగా చూపించబోతున్నాడు. ఏడాది పాటు శ్రమించి తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 7న రిలీజ్ కి రాబోతోంది. ఆయన శ్రీమంతుడి గురించి చెబుతూ ''మహేష్ లాంటి హీరోతో కమర్షియల్ సినిమా కన్నా వేరే కథ తీయాలనిపిచ్చింది. అందుకే శ్రీమంతుడి కథను రాసుకొన్న..బిలిగేట్స్ లాంటి వ్యక్తి సగం ఆస్తిని ధనాధర్మాలకు రాసిచ్చాడట. అలాంటి వార్తలు ఎన్నో తనకు స్పూర్తినిచ్చాయని, వున్నదాన్ని ఇతరులకు పంచి పెట్టడంలో వున్న హీరోజం ఎక్కడుంది?'' అని చెప్పారు. మహేష్ అభిమానులలో ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. గత వరుస ఫ్లాప్ లను అందుకున్న మహేష్ కి శ్రీమంతుడి హిట్ ఏంతో అవసరం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
