మహేష్ 26 ఓపెనింగ్ ఎప్పుడంటే?
on May 27, 2019

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫారిన్ ట్రిప్‌లో ఉన్నారిప్పుడు! 'మహర్షి' సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నాని పోస్టులు పెడుతున్నారు. అదే సంతోషంలో నెక్స్ట్ సినిమా ఓపెనింగ్‌కి ముహూర్తం కూడా పెట్టేశారు. 'ఎఫ్ 2'తో ఒక్కసారిగా స్టార్ దర్శకుల జాబితాలో చేరిన అనిల్ రావిపూడితో మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఆదివారం అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. త్వరలో క్లాప్ కొడతామని అన్నారు. త్వరలో అంటే మరెంతో దూరంలో లేదు. ఈ నెల 31న సినిమా ఓపెనింగ్. ఎప్పుడూ మహేష్ సినిమా ఓపెనింగ్‌లకు అటెండ్ అవ్వరు. ఆయనకు అదొక సెంటిమెంట్. ఈ సినిమా ఓపెనింగ్‌కి కూడా అటెండ్ కారు. ఫారిన్ ట్రిప్‌లో ఉంటారని టాక్. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి 31న క్లారిటీ ఇచ్చే ఆలోచనలో టీమ్ ఉంది. 'మహర్షి' తరవాత మహేష్ బాబుతో మరోసారి దిల్ రాజు అసోసియేట్ అవుతున్నారు. అనిల్ సుంకరతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



