'కల్కి-2'లో మహేష్ హీరోయిన్.. దీపికను మరిపిస్తుందా?
on Dec 2, 2025

'కల్కి-2' కోసం మహేష్ హీరోయిన్
సుమతి పాత్రలో మందాకిని
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నుండి రానున్న అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో 'కల్కి-2'(kalki 2) ఒకటి. అయితే 'కల్కి'లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొనేను.. ఆమె పెట్టిన కొన్ని షరతుల వల్ల మేకర్స్ తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో దీపిక బదులుగా 'కల్కి-2'లో నటించే నటి ఎవరనే ఆసక్తి నెలకొంది.
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'కల్కి 2898 AD'. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. 2024 జూన్ లో విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.1100 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో పార్ట్-2 కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read: దేవర-2.. క్లారిటీ ఇచ్చేసిన ఎన్టీఆర్!
'కల్కి'లో సుమతి(SUM-80) అనే కీలక పాత్ర పోషించింది దీపిక. ఓ రకంగా ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. పార్ట్-2 లోనూ ఆమె పాత్ర కీలకం. అలాంటిది ఈ ప్రాజెక్ట్ నుండి దీపికను తప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పాత్రను ఎలా రీప్లేస్ చేస్తారు? ఆమె ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారు? వంటి చర్చలు జరిగాయి.
తాజాగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. 'కల్కి-2'లో సుమతి పాత్ర కోసం ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ప్రియాంక ఇప్పటికే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ ఫిల్మ్ 'వారణాసి'లో మందాకినిగా నటిస్తోంది. ఇప్పుడు 'కల్కి-2'లో నటించనుందనే వార్త నిజమైతే.. ఒకేసారి తెలుగులో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లు అవుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



