Mahavatar Narsimha: ఆస్కార్ బరిలో మహావతార్ నరసింహ..!
on Nov 25, 2025
![]()
మరో ఘనత సాధించిన మహావతార్ నరసింహ
ఆస్కార్ రేస్ లో యానిమేటెడ్ ఫిల్మ్
హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీం ప్రొడక్షన్స్ నిర్మించిన యానిమేటెడ్ మైథలాజికల్ ఫిల్మ్ 'మహావతార్ నరసింహ'. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ మూవీ, పెద్దగా అంచనాల్లేకుండా ఈ ఏడాది జూలై 25న థియేటర్లలో అడుగుపెట్టింది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, పాజిటివ్ మౌత్ టాక్ తో.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది. ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన యానిమేటెడ్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. (Mahavatar Narsimha)
తాజాగా 'మహావతార్ నరసింహ' మరో ఘనత సాధించింది. 98వ ఆస్కార్ అవార్డుల బరిలో ఈ చిత్రం నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 35 సినిమాలలో ఒకటిగా 'మహావతార్ నరసింహ' నిలిచింది. ఈ విభాగంలో ఆస్కార్ గెలిచి, చరిత్ర సృష్టించాలని.. భారతీయ సినీ అభిమానులు కోరుకుంటున్నారు. (Oscars 2026)
Also Read: బాలయ్య తాండవానికి యూట్యూబ్ షేక్!
నరసింహ అవతారంలో విష్ణువు ప్రత్యక్షమై, హిరణ్యకశిపుడిని సంహరించిన పురాణ కథ నేపథ్యంలో 'మహావతార్ నరసింహ' తెరకెక్కింది. అసలు ఇండియాలో యానిమేటెడ్ సినిమాలు రావడమే అరుదు. అలాంటిది మైథలాజికల్ స్టోరీతో, దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో.. ఈ సినిమాని రూపొందించడం సాహసమనే చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే విడుదలకు ముందు 'మహావతార్ నరసింహ'పై పెద్దగా అంచనాల్లేవు. అయితే కంటెంట్ బాగుంటే చాలు, స్టార్స్ తో సంబంధం లేదనే విషయాన్ని రుజువు చేస్తూ.. ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు ఆస్కార్ దిశగా అడుగులు వేస్తోంది.
![]()
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



