జెసిప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు చేయించిన మాధవిలత
on Jan 18, 2025
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'నువ్విలా' మూవీతో తెలుగు సినీ రంగానికి పరిచయమైన హీరోయిన్ మాధవిలత.మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు పొందిన మాధవి లత ఆ తర్వాత స్నేహితుడా,ఉసురు,చూడాలని చెప్పాలని,అనుక్షణం వంటి పలు తెలుగు సినిమాలో మెరిసింది.కొన్నితమిళ సినిమాల్లో కూడా నటించిన ఆమె ప్రస్తుతం భారతీయజనతా పార్టీ తరుపున రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
రెండు వారాల క్రితం తాడిపత్రి మున్సిపల్ కమిషన్ చైర్మన్,మాజీ ఏంఎల్ఏ జెసిప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన నూతన సంవత్సరం వేడుకల్ని ఉద్దేశించి మాధవిలత సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆరోపణలు చేయడం,వాటికి కౌంటర్ ఇచ్చే సమయంలో మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాటలకి క్షమాపణలు చెప్పాడు.కానీ ఇప్పడు జెసి ప్రభాకర్ రెడ్డి పై మాధవిలత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( మా) లో ఫిర్యాదు చేసింది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేను సోషల్ ఎవర్నేస్ కోసమే ఆ వీడియో చేశాను.ఆయన సారీ చెప్పినప్పుడు కూడా నేను సినిమా అమ్మాయిని అని చులకనగా మాట్లాడాడు. ఈ విషయంలో నేను హ్యూమన్ కమిషన్ ని కూడా కలిసాను. కేసు నంబర్స్ కూడావాళ్ళు ఇచ్చారు.సినిమా వాళ్లంటే ఆయనకి అంత చులకన ఎందుకు.నాపై చేసిన ఆరోపణల మీద న్యాయ పరంగా పోరాడతానని చెప్పుకొచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
