ENGLISH | TELUGU  

Mad For Each Other: బోల్డ్ రియాలిటీ షో.. ఒకే విల్లాలో పది సెలబ్రిటీ జంటలు..!

on Feb 17, 2026

 

బిగ్ బాస్ తరహాలో ఒక కొత్త రియాలిటీ షోకు శ్రీకారం చుట్టింది జియో హాట్‌స్టార్. తాజాగా 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌'(Mad For Each Other) అనే కొత్త షోను అనౌన్స్ చేసింది. ప్రేమ, విశ్వాసం, పార్ట్‌నర్‌షిప్ ని పరీక్షించే సరికొత్త బోల్డ్ రియాలిటీ ఫార్మాట్‌గా ఈ షోను రూపొందించారు.

 

“ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్” పేరుతో వస్తున్న ఈ షోలో పది సెలబ్రిటీ జంటలు ఒక అద్భుతమైన విల్లాలో 70 రోజుల పాటు కలిసి ఉండబోతున్నారు. భావోద్వేగాలు ఉప్పొంగే ఈ ప్రయాణంలో.. రిలేషన్‌షిప్‌ బలం, అనురాగం, నమ్మకం, మోడరన్ ప్రేమలోని విభిన్న కోణాలను “మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్” ఆవిష్కరించనుంది.

 

''10 Celebrity Couples. 70 Days. One Villa.” అనే ఆసక్తికరమైన లైన్‌తో సోషల్ మీడియాలో టీజర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ షోలో పాల్గొనే జంటలు ఎవరు? వాళ్ళు ఎదుర్కోనున్న సవాళ్లు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలుగుతోంది.

 

రొమాన్స్, డ్రామా, భావోద్వేగ క్షణాలు, అనూహ్య ట్విస్ట్ లతో ప్రేక్షకులను మొదటి రోజు నుంచే ఆకట్టుకునేలా ఈ షోను రూపొందించారు. టఫ్ టాస్కులు, రిలేషన్‌షిప్‌ ని పరీక్షించే నిర్ణయాత్మక పరిస్థితులు ఇదివరకు ఎన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ ని అందించబోతున్నాయి. 

 

'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ప్రీమియర్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. మరి ఈ రియాలిటీ షో ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

 

Also Read: మాట మార్చిన కావేరి.. అల్లు అర్జున్ 42 రూల్స్ నిజామా కాదా?

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.