మ్యాడ్ స్క్వేర్ కి మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్!
on Mar 30, 2025
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. 2023 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం.. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మ్యాడ్ స్క్వేర్.. అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. (Mad Square Collections)
'మ్యాడ్' వంటి సూపర్ హిట్ కామెడీ ఫిల్మ్ కి సీక్వెల్ కావడంతో పాటు, వేసవి సెలవులు తోడు కావడంతో.. మ్యాడ్ స్క్వేర్ రికార్డు ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.20.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు కూడా అదే జోరు చూపిస్తూ రూ.16.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ సాధించింది.
మూడు రోజు ఆదివారం కావడంతో మరో రూ.15-20 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది. దీంతో మూడు రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది. ఇక నాలుగో రోజు రంజాన్ సెలవు కావడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. యూత్ ఎంజాయ్ చేసే కామెడీ సినిమా కావడంతో.. ఫుల్ రన్ లో మ్యాడ్ స్క్వేర్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యంలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
