'ఆహా'లో నాగ చైతన్య 'లవ్ స్టోరి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?..
on Oct 11, 2021
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లవ్ స్టోరి'. సెప్టెంబర్ 24న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా 'లవ్ స్టోరి' మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 22 నుంచి లవ్ స్టోరి సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 24న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా నాలుగు వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి రానుండడం విశేషం. థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'లవ్ స్టోరి'.. ఓటీటీలో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో 'థాంక్ యూ' సినిమా చేస్తున్నాడు. అలాగే ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', నాగార్జున 'బంగార్రాజు' సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.
Also Read