ENGLISH | TELUGU  

'లైగర్' గ్లింప్స్.. 'అర్జున్ రెడ్డి'కి మించి!

on Dec 31, 2021

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆటిట్యూడ్ తో సెలబ్రిటీలను సైతం ఆకట్టుకున్నాడు. ఇక హీరోలను కొత్తగా చూపించడంలో పూరి దిట్ట. సినిమా రిజల్ట్ తో సంబంధం పూరి సినిమాల్లో హీరోల ఆటిట్యూడ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయిద్ది. అలాంటి పూరి ఇప్పుడు విజయ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్'.

విజయ్, పూరి కాంబోలో ప్రకటించిన లైగర్ పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాకి సంబంధించి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేశారు. పూరి మార్క్ టేకింగ్, విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇండియా నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో పాల్గొనే ముంబై స్లమ్స్ లో పెరిగిన కుర్రాడిగా విజయ్ కనిపించాడు. అర్జున్ రెడ్డిలో తన ఆటిట్యూడ్ తో ఆకట్టుకున్న విజయ్.. పూరి డైరెక్షన్ వస్తున్న లైగర్ లో అంతకుమించి ఆటిట్యూడ్ చూపించబోతున్నాడని ఫస్ట్ గ్లింప్స్ ని బట్టి అర్థమవుతుంది.

లైగర్ ఫస్ట్ గ్లింప్స్ కి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి విజయ్, పూరి కాంబోపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏంటో చెప్పొచ్చు. ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన 5 గంటల్లోనే యూట్యూబ్ లో 6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ నెంబర్ 1 గా ఉంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.