లియో సినిమా కాపీనా.. విజయ్ ఫాన్స్ నిరాశ!
on Oct 6, 2023
సాధారణంగా ఏ హీరో అభిమానలు అయినా షూటింగ్ జరుపుకుంటున్న తమ హీరో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉండటం కామన్. కానీ దళపతి విజయ్ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు తమ హీరో నటించిన లియో సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అంటే లియో సినిమా కి ఉన్న క్రేజ్ ఎలాంటిందో అర్ధం చేసుకోవచ్చు. ఎట్టకేలకు వాళ్ళ ఆశలు ఫలించి లియో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అవ్వడమే కాదు తమిళనాడు విజయ్ నామ స్మరణం తో మారోమోగిపోయింది. చెన్నై సిటీ తో పాటు తమిళనాడులోని చాల థియేటర్స్ లో లియో ట్రైలర్ ప్రదర్శించబడి లియో తుపాన్ ని సృష్టించింది. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత లియో సినిమా ఆ హిస్టరీ అఫ్ వయోలెన్స్ అనే సినిమా కి కాఫీ సినిమా అనే టాక్ ప్రకంపనలు సృష్టిస్తుంది.
విజయ్ ఎంత మంచి యాక్టరో ప్రతేకంగా చెప్పుకోవక్కర్లేదు. అలాగే లోకేష్ కనగ రాజ్ కూడా తనకి మాత్రమే సాధ్యమయ్యే వెరైటీ స్క్రీన్ ప్లే తో సినిమా ని ఒక రేంజ్ లో తెరకెక్కిస్తాడు.సెవెన్ స్టూడియో పతాకం పై లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా 2005 లో హాలీవుడ్ లో వచ్చిన ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ అనే సినిమా కి కాఫీ సినిమా అని కొంత మంది చెప్తున్నారు .ఆ మూవీ టామ్ స్టాల్ అనే హోటల్ ఓనర్ తన హోటల్లో లూటీకి ప్రయత్నించిన ఇద్దరు దొంగల్ని కాల్చి చంపుతాడు.ఆ సంఘటనతో టామ్ సమాజం దృష్టిలో హీరో అవుతాడు. మీడియా కూడా అతడి గురించి గొప్పగా చెప్తుంది ఆయా తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. కొంత మంది గ్యాంగ్ స్టార్స్ స్టాల్‌ను గ్యాంగ్‌స్టర్ గా భావించి అతడితో పాటు అతని కుటుంబాన్నీ కూడా టార్గెట్ చేస్తాయి.
దీంతో కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్టాల్ నానా అవస్థలు పడతాడు. తర్వాత స్టాల్‌లోని అసలు గ్యాంగ్‌స్టర్ బయటికి వస్తాడు. ఈ కథ లోకేష్ కనకరాజ్ లియో సినిమా గా తెరకెక్కిస్తున్నాడని లియో ట్రైలర్లోని చాలా షాట్లను ఎ హిస్టరీ ఆఫ్ వయోలెన్స్ తో పోలుస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.కానీ లోకేష్ అభిమానులు మాత్రం అలాంటిదేం కాదు అని అంటున్నారు.ఒక్క విషయం మాత్రం వాస్తవం లియో ట్రైలర్ లో లియో కథ ఎలా ఉండబోతుందో విజయ్ వాయిస్ ద్వారా చెప్పించింది.అచ్చం ఇప్పుడు కొంత మంది చెప్తున్నట్టుగా ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ మూవీ కథ లాగానే ఉంది.లోకేష్ తన స్టయిల్లో స్క్రీన్ ప్లే లో కొన్ని మార్పులు చేసి ఉండవచ్చు.ఏది ఏమైనా అక్టోబర్ 19 న లియో విడుదల అవ్వుతుంది కాబట్టి అప్పుడు లియో కాపీ సినిమానా లేక ఒరిజినల్ సినిమానా అని తేలిపోతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
