`గంగూబాయ్`తోనైనా బ్రేక్ పడుతుందా?
on Mar 6, 2021
కథానాయికగా అలియా భట్ ది 9 ఏళ్ళ ప్రస్థానం. ఈ ప్రయాణంలో విజయాల వాటే ఎక్కువ. `స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్` నుంచి `గల్లీ బాయ్` వరకు అలియా నటించిన సినిమాల్లో సింహభాగం సక్సెస్ అయ్యాయి. లేడీ లక్ గా బాలీవుడ్ ఆమెని కీర్తించేలా చేశాయి. అయితే గత రెండేళ్ళుగా అలియా ట్రాక్ రికార్డ్ ఏమంత బాగోలేదు. ఇటీవల తను నాయికగా నటించిన భారీ బడ్జెట్ మూవీస్ నెగటివ్ రిజల్ట్స్ సొంతం చేసుకుంటున్నాయి.
రెండేళ్ళ క్రితం థియేటర్స్ లో విడుదలైన `కళంక్`, నిరుడు ఓటీటీలో స్ట్రీమ్ అయిన `సడక్ 2`.. అలియాని తీవ్ర నిరాశపరిచాయి. తన కెరీర్ కి ఆ చిత్రాలు ప్లస్ కాకపోగా.. మైనస్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో... రాబోయే చిత్రం `గంగూభాయ్ కతియావాడి`పైనే అలియాభట్ ఆశలు పెట్టుకుంది. వెర్సటైల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ఈ సినిమాలో వేశ్యగా, మాఫియా క్వీన్ గా సరికొత్తగా దర్శనమివ్వనుంది అలియా. జూలై 30న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది. ఈ మూవీతోనైనా ఫ్లాప్స్ కు బ్రేక్ పడుతుందన్న ఆశాభావంతో ఉంది అలియా.
మరి.. `గల్లీ బాయ్` తరువాత సరైన విజయం లేని అలియాకి `గంగూభాయ్` అయినా సక్సెస్ అందిస్తుందేమో చూడాలి. ఒకవేళ ఈ సినిమా నిరాశపరిచినా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న పాన్ - ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` ఉండనే ఉంది. అక్టోబర్ 13న ఈ బడా మల్టిస్టారర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read