నా జీవితంలోకి ఓవర్‌గా తొంగిచూశారంటోన్న స్టార్ హీరోయిన్!
on Dec 23, 2022
అత్త తిట్టినందుకు కాదు...తోడికోడలు నవ్వినందుకే అన్నట్లుగా ఉంది సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్ నయనతార. తన అమాయకమైన చూపులు, ముఖంలో నగుమోము కలిగిన అత్యద్భుతమైన నటి ఆమె. నవరసాలలో దేనినైనా ఆమె ఇట్టే తన ముఖంలో పలికించేస్తుంది. ఏకంగా ది గ్రేట్ లెజెండరీ ద్వయమైన బాపు-రమణలు నందమూరి బాలకృష్ణని శ్రీరామునిగా ఎంచుకుని శ్రీరామరాజ్యం తెరకెక్కించాలని భావించారు. కానీ భారతీయ సినీ వినీలాకాశంలో నేటితరంలో నయనతార తప్ప సీత పాత్రకు మరెవ్వరు సరితూగరని భావించారు. దాని గురించి బాలకృష్ణ ఓ సందర్బంగా సీతగా నయనతార ఒప్పుకోకపోతే అసలు ఈ ప్రాజెక్ట్‌ను నేను, బాపు-రమణం చేసేవారిమే కాదు. ప్రాజెక్ట్ నే పక్కన పెట్టేసేవారిమని వ్యాఖ్యానించాడు. అందులో నిజం కూడా ఉంది. సౌందర్య మరణం తర్వాత సీత పాత్రను పోషించగల ఒకే ఒక నటి నయనతార అని అందరు ఒప్పుకుంటారు.
ఇక ఈ చిత్రంలో సీతగా ఆమె చూపిన నటన అనన్యసామాన్యం. ఇక విషయానికి వస్తే ఆమె తాజాగా నటించిన చిత్రం కనెక్ట్. ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితం పై కీలక వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాతో పాటు పలువురు బురద చల్లారు... అంటూ వ్యాఖ్యానించింది. వాస్తవానికి నయనతార తన కెరీర్ లో వివాదాస్పద హీరో, తనతో నటించిన ప్రతి హీరోయిన్‌ని ముగ్గులోకి దింపి ఎఫైర్ నడిపే శింబుతో ఆమె ఎఫైర్ నడిపింది. అది కూడా బాధ్యత లేకుండా. ఆమె అజాగ్రతతోనే నయన-శింబులు పర్సనల్ ఫొటోలు, లిప్ లాక్ పిక్స్ బహిరంగం అయ్యాయి. కానీ అక్కడితోనైనా ఆగిందా? అంటే అదీ లేదు. పెళ్లై భార్య పిల్లలు ఉన్న డాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపి, పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. ప్రభుదేవా మొదటి భార్య ఘటికురాలు కావడంతో అది మూడు ముళ్ల వరకు వెళ్లలేదు. ఇలా ఎఫైర్స్ నడిపింది, తన అజాగ్రతతో వాటి లీకులకు పరోక్ష కారణం నయననే. అందునా భార్య పిల్లలు ఉన్న వారితో ఏమని ప్రేమలో పడిందో ఆమెకే తెలియాలి.
ఇప్పుడు మాత్రం నయన తనదైన అమాయకు నటనతో నిజజీవితంలో కూడా అందరినీ తన తప్పు లేదని ఒప్పించాలని, ఇంకా కావాలంటే తన తప్పును ఇతరుల మీదకు తోయాలనే ఆరాటం కనిపిస్తోంది. నా వ్యక్తిగత జీవితంలోకి పరిమితికి మించి తొంగి చూశారు. బహుశా నేను ఉన్న వృత్తి దాని కారణం కావచ్చు. ఒక దశ వరకు ఓకే.... కానీ హద్దులు దాటి నా పర్సనల్ లైఫ్ లోకి కొందరు చొచ్చుకుని వచ్చారని నయనతార మండిపడింది. ఈ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పోనీ అప్పటికైనా మారిందా? అంటే అదీ లేదు. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఎంతో కాలం సహజీవనం చేసింది. గుళ్లు గోపురాలకు ఇద్దరు కలిసి వెళ్తూ వార్తల్లోకి ఎక్కారు. పెళ్లికి ముందే ఈమె గర్భం దాల్చిందని కూడా వార్తలు వచ్చాయి. పెళ్లయిన వెంటనే తిరుమల మాడవీధుల్లో చెప్పులతో నడిచి వివాదంలో ఇరుక్కుంది.పెళ్లయిన నెలల వ్యవధిలో పేరెంట్స్ అయ్యామన్న నయనతార -విగ్నేష్ లు సరోగసి చట్టాలను ఉల్లంఘించారనే సందేహంతో తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కానీ తమకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగిందని, సరోగసి నిబంధనలు అతిక్రమించలేదని ఆధారాలు చూపి ఈ వివాదం నుంచి భార్యాభర్తలు బయటపడ్డారు. అంటే గత ఐదు ఏళ్ళుగా వారు భార్యాభర్తలుగానే జీవించిన విషయాన్ని అఫీషియల్ గా ఇప్పుడు ఖరారు చేసారు అనమాట..! ఇంతటి ఘన చరిత్ర కలిగిన నయన అమాయకంగా నంగి నంగిగా ముద్దు ముద్దు చిలక పలుకులు పలికితే అందరు నమ్మేస్తారు అనుకోవడం నూతిలోని కప్ప తరహాలో, పిల్లి కళ్లుమూసుకుని ఎవ్వరు తనను చూడటం లేదన్నట్లుగా ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
