ఇక ఆ మూవీకి హృతిక్ రోషనే దర్శకుడు..అధికార ప్రకటనతో మైండ్ బ్లాంక్
on Mar 28, 2025
బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో హృతిక్ రోషన్(Hrithik Roshan)కూడా ఒకడు.రెండున్నర దశాబ్దాల నుంచి తనదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు.ప్రస్తుతం తన కొత్త మూవీ వార్ 2(war 2)తో బిజీగా ఉన్నాడు.టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్(Ntr)తో కలిసి వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.తన నెక్స్ట్ మూవీగా క్రిష్ సిరీస్ కి కొనసాగింపుగా వస్తున్న క్రిష్ 4 చెయ్యబోతున్నాడు.ఇప్పటికి వరకు వచ్చిన మూడు భాగాలకి దర్శకత్వం వహించిన రాకేష్ రోషన్ నే నాలగవ భాగానికి దర్శకుడని అందరు అనుకున్నారు.కానీ ఇటివల ఒక ఇంటర్వ్యూ లో రాకేష్ రోషన్(Rakesh Roshan)మాట్లాడుతు క్రిష్ 4(krrish 4)కి నేను దర్శకత్వం వహించడం లేదని చెప్పడం జరిగింది.దీంతో దర్శకుడుగా ఎవరు చేస్తారనే చర్చ బాలీవుడ్ సర్కిల్స్ లో గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది.
ఈ క్రమంలో రీసెంట్ గా రాకేష్ రోషన్ 'ఎక్స్ 'వేదికగా హృతిక్ రోషన్ ని ఉద్దేశించి పోస్ట్ చేస్తు ఇరవై ఐదేళ్ల క్రితం నిన్ను యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాను.ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదేళ్ల తర్వాత ఆదిత్య చోప్రా,నేను కలిసి నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.ప్రతిష్టాత్మక క్రిష్ 4 కి నువ్వు దర్శకుడిగా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందంటు పోస్ట్ చేసాడు.
బాలీవుడ్ సినీ రంగంలో హృతిక్ లాంటి ఒక బిగ్ స్టార్ తన సినిమాకి తానే దర్శకత్వం వహించడం,పైగా క్రిష్ 4 లాంటి ఒక ప్రెస్టేజియస్ట్ మూవీకి దర్శకత్వం వహించడంతో ఈ న్యూస్ ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.క్రిష్ 4 ని మొదటి మూడు పార్టులు మించి హాలీవుడ్ రేంజ్ లో 700 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కించనున్నారనే వార్తలు వస్తున్నాయి.మూవీకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.రాకేష్ రోషన్, హృతిక్ తండ్రి కొడుకులనే విషయం తెలిసిందే.హృతిక్ ఫస్ట్ మూవీ 'కహోనా ప్యార్ హై' కి రాకేష్ రోషనే దర్శకుడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
