క్రిష్ కాపీ చేద్దామనుకున్న నవల ఇదే
on Feb 16, 2017

గౌతమీపుత్ర శాతకర్ణి ఘానా విజయంతో మంచి ఊపుమీదున్న డైరెక్టర్ క్రిష్ తన తదుపరి చిత్రం గా వెంకటేష్ తో సోసియో ఫాంటసీ మూవీ చేద్దామని అనుకున్నాడు. దానికి తగ్గ కథను కూడా సిద్ధం చేసుకున్నాడు. అంత ఓకే అయితే, మార్చ్ లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళేది. ఇంతలో, ఒక అనుకోని సంఘటన ఈ సినిమా ఆగేలా చేసింది.
వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ రచయిత కేశవ రెడ్డి రాసిన అతడు అడవిని జయించాడు నవల ఆధారంగా చేసుకొని సినిమా చేద్దాం అనుకున్నాడు క్రిష్. నవల సాంతం కాకపోయినా కొన్ని ఆసక్తికర సంఘటలని దాంట్లోంచి తీసుకుందాం అనుకున్నాడు. ఆ రచయితతో మాట్లాడుకుందాం అనుకునేంతలో, వేరెవరో నిర్మాత తన తదుపరి చిత్రం కోసం ఆ నవల హక్కుల్ని సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతానికి, క్రిష్ కి రెండే దారులున్నాయి. ఒకటి, ఆ సినిమాని ఆపడం. రెండోది కథ సాంతం మర్చి నవలకి సంబంధం లేకుండా తీయడం. చూద్దాం క్రిష్ ఏ దారి ఎంచుకుంటాడో. అయితే, గత కొన్ని రోజులుగా వస్తున్న 'సదరు సినిమా క్యాన్సల్ అయింది' అన్న వార్తలకి క్రిష్ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. ఇంతకీ, అతడి ఆంతర్యం ఏమయి ఉంటుందబ్బా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



