కిరణ్ అబ్బవరం 'క' మూవీకి దిమ్మతిరిగే బిజినెస్!
on Jul 25, 2024
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అప్ కమింగ్ మూవీ 'క' (KA). శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక పీరియాడిక్ ఫిల్మ్. ఇటీవల విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమా పట్ల ట్రేడ్ సర్కిల్స్ లో క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే బిజినెస్ భారీగా జరుగుతోంది.
'క' మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను వంశీ నందిపాటి రూ.12 కోట్లకు తీసుకున్నారట. ఇతర భాషల థియేట్రికల్ రైట్స్, నాన్-థియేట్రికల్ రైట్స్ కలిపి మరో రూ.18 కోట్లు పలుకుతున్నాయట. అంటే ఈ మూవీ ఓవరాల్ గా రూ.30 కోట్ల బిజినెస్ చేయనుంది. కిరణ్ అబ్బవరం లాంటి యంగ్ హీరో సినిమాకి రూ.30 కోట్ల బిజినెస్ జరగడం అనేది నిజంగా విశేషమే.
కెరీర్ స్టార్టింగ్ లో 'రాజావారు రాణిగారు', 'SR కళ్యాణమండపం' వంటి సినిమాలతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం.. ఆ తరువాత వరుస పరాజయాలతో నిరాశపరిచాడు. సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న 'క' టీజర్ ప్రామిసింగ్ గా కనిపించింది. దీంతో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఫామ్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
Also Read