సెన్సార్ రివ్యూ : కేశవ
on May 16, 2017
వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్ నుంచి మరో సినిమా వస్తోంది. అదే కేశవ. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈచిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. స్వామి రారాతో.. నిఖిల్ కెరీర్‌ని మార్చేసిన దర్శకుడు సుధీర్ వర్మ. అందుకే కేశవ పై అంచనాలు పెరిగాయి. ఈనెల 19న ఈ చిత్రం విడుదల కాబోతోంది. సోమవారం కేశవకి సెన్సార్ కూడా పూర్తయ్యింది. ఈ చిత్రానికి యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటీవ్ గానే ఉంది. ఇదో రివైంజ్ డ్రామా. రివైంజ్ కథలు తెలుగునాట మరమ రొటీన్ జోనర్.
అయితే.. రివైంజ్ డ్రామాలో థ్రిల్లర్ మిక్స్ చేసిన తెరకెక్కించిన విధానం ఆకట్టుకొనేలా ఉందన్నది సెన్సార్‌రిపోర్ట్. కేశవగా నిఖిల్ పెర్‌ఫార్మ్సెన్స్ మరోస్థాయిలో ఉందని తెలుస్తోంది. కథానాయకుడికి ఓ లోపం పెట్టి.. ఆ బలహీనతపైన నడిపించినడ్రామా కూడా ఆకట్టుకొనేలా ఉందని చెబుతున్నారు. ఇందులో కథానాయకుడికి వెరైటీగా కుడివైపున గుండె ఉంటుంది. ఎక్కువ టెన్షన్‌పడినా, ఆవేశ పడినా.. ప్రాణానికే ప్రమాదం. ఈ పాయింట్‌మీద నడిపించిన డ్రామా.. ఈ సినిమాకే హైలెట్ అని తెలుస్తోంది. చివరి వరకూ ఊపిరి బిగబెట్టుకొని చూసేలా స్క్రీన్ ప్లే సాగిందని, టెక్నికల్ గా ఈ సినిమా మరో స్థాయిలో ఉందని తెలుస్తోంది. అయితే నిఖిల్ ఈమధ్య హిట్లు కొట్టిన సినిమాల్లో కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సినిమాలో అదే మిస్సయ్యిందని తెలుస్తోంది. సినిమా మొత్తం సీరియెస్ టెంపోలో సాగిందని, దాన్ని బీ, సీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలని చెబుతున్నారు. ఓవరాల్‌గా మస్ట్ వాచ్ మూవీస్‌లో కేశవ ఒకటిగా నిలవడం ఖాయమన్న ధీమా వ్యక్తం అవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
