కాంతార చాప్టర్ 1 ఓటిటి డేట్ వచ్చేసింది.. ఇక అభిమానులకి పండగే
on Oct 27, 2025

- కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
- కాంతార చాప్టర్ 1 ఓటిటి డేట్
- రిషబ్ శెట్టి విశ్వరూపం
అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్ల సునామీని సృష్టించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళల్లో రిషబ్ శెట్టి(Rishab Shetty)కి ప్రధమ స్థానాన్ని కట్టబెట్టవచ్చు. కాంతార తో అదే విధంగా వచ్చి రికార్డు కలెక్షన్స్ ని సృష్టించి, ఇప్పుడు కాంతార చాప్టర్ 1(Kantara chapter 1)తో తగ్గేదెలే అనే విధంగా రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ నెల 2 న థియేటర్స్ లో అడుగుపెట్టిన చాప్టర్ 1 ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ ని రాబట్టి భారతీయ చిత్ర పరిశ్రమలో ఆ స్థాయి కలెక్షన్స్ ని సాధించిన 13 వ చిత్రంగా నిలిచింది.
ఇప్పుడు ఈ మూవీ టీం ఓటిటి సినీప్రేమికులకి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా అధికారకంగా ప్రకటించింది. మరి థియేటర్స్ లో సంచలన విజయాన్ని అందుకున్న చాప్టర్ 1 ఓటిటిలో కూడా రికార్డు స్థాయిల్లో సంచలన విజయం సాధించడం పక్కా అనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది.
Also read: బాహుబలి లాంటి సినిమాని బాలీవుడ్ తెరకెక్కించగలదా!
ఇక ఈ చిత్రంలో రిషబ్ శెట్టి పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బెర్మే అనే రోల్ తో పాటు శివుడు ఆవహించిన క్యారక్టర్ లో వీరవిహారం చేసాడు. రిషబ్ శెట్టి దర్శకత్వం కూడా కట్టిపడేస్తుంది. ప్రిన్సెస్ కనకవతి గా చేసిన రుక్మిణి వసంత్(Rukmini vasanth)క్యారక్టర్ లోని డైవర్షన్ కూడా సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తుంది. జయరాం, గుల్షన్ దేవయ్య కూడా తమ పాత్రలతో మెస్మరైజ్ చేసారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



