విడుదలకు ముందు 'కల్కి' టీం సంచలన నిర్ణయం.. షాక్ లో ఫ్యాన్స్..!
on Jun 21, 2024

ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గరపడిన వేళ.. మూవీ టీం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ముంబైలో 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. దానిని మించేలా అత్యంత భారీ స్థాయిలో తెలుగునాట ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని ఇటీవల ప్రచారం జరిగింది. అమరావతిలో జరగనున్న ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని వార్తలొచ్చాయి. ఒకవేళ అమరావతిలో కుదరని పక్షంలో.. హైదరాబాద్ లో అయినా ఈవెంట్ ఉంటుందని న్యూస్ వినిపించింది. దీంతో తెలుగునాట జరిగే ఈ భారీ ఈవెంట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు 'కల్కి' టీం ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అంతేకాదు, తెలుగునాట ప్రత్యేకంగా ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ఏమీ ఉండవట. ఈ న్యూస్ ఫ్యాన్స్ కి డిజప్పాయింట్ కలిగిస్తోంది.
అయితే తెలుగులో ప్రమోషన్స్ చేయకపోవడం వెనుక ఓ స్ట్రాటజీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమా అంటే తెలుగునాట ఎలాగూ రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి. అందుకే విడుదలకు ముందు మితిమీరిన అంచనాలు పెంచే కంటే.. థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ ని తమ కంటెంట్ తో సర్ ప్రైజ్ చేయాలనేది మేకర్స్ స్ట్రాటజీ అని సమాచారం. మరి 'కల్కి' టీం స్ట్రాటజీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



